ప్రభుత్వ నిధులతో నడిచే విశ్వవిద్యాలయాలు పార్టీ రాజకీయాలుగా వేదికలుగా మారుతున్న ఈ కాలంలో, ఇప్పుడొక ప్రైవేటు ఇంజనీరింగు సంస్థ ఈ విషయం మీద ఇటువంటి ఒక గోష్ఠి నిర్వహించడం, అందుకనే, నాకెంతో సంతోషం కలిగించింది. ..
ఇవన్నీ చెప్పాలి పిల్లలకి
ఏమీ అక్కర్లేదు, కనీసం కళాశాల వార్షికోత్సవానికి ఒక నాటకం వెయ్యడానికి పూనుకున్నా కూడా కలిసి పనిచెయ్యడంలో ఉండే ఉత్సాహాన్ని , అది పిల్లలకి రుచిచూపిస్తుంది. ఒకరినొకరు అర్థం చేసుకుని, ఒకరి సామర్థ్యాల్నీ, బలహీనతల్నీ కూడా మరొకరు సహానుభూతితో చూడగల సంస్కారాన్ని అలవరుస్తుంది.
