ఎక్కణ్ణుంచి వస్తున్నది ఈ శక్తి మనుషులకి? దీన్ని అన్వేషించడంకోసమే ఆమె రచనలు చెయ్యడం మొదలుపెట్టిందని మనకు తెలుస్తున్నది.
కొత్త యుగం రచయిత్రి-1
ఆమె మామూలు రచయిత్రి కాదనీ, ఆమె ఒక దేశానికీ, ఒక దేశచరిత్రకీ మాత్రమే ప్రతినిధి కాదనీ, ప్రపంచంలో ఏ మూల ఏ పాఠకుడు తన పుస్తకాలు చేతుల్లోకి తీసుకున్నా అతణ్ణి లోపలనుంచీ కుదిపెయ్యగల శక్తి ఏదో ఆమె అనుభవాలకీ, ఆలోచనలకీ, భావనలకీ, పర్యావలోకనానికీ ఉందని అర్థమయింది.
