తాను ఏ డోంగ్రియా కోదు జీవితాన్ని వర్ణిస్తున్నాడో ఆ ఆదివాసుల్ని ఈ రచయిత చాలా దగ్గరగా చూసాడనీ, చాలాచోట్ల వారితో మమేకమయ్యాడనీ, వారిని మాత్రమే కాదు, వారి దేవతల్ని కూడా దగ్గరగా చూసాడనీ ఈ నవల సాక్ష్యం చెప్తున్నది.
అమృతసంతానం
ఇప్పుడు ఈ ఇంగ్లీషు అనువాదం చదివే ఆఫ్రికా జాతుల పాఠకులు, పసిఫిక్ సముద్ర దీవుల్లోని పాఠకులు, ఎస్కిమోలు, రెడ్ ఇండియన్లు కూడా తమలాంటి ఒక తెగ భారతదేశంలో జీవిస్తూ ఉన్నారని, తామంతా కూడా ఒకే మహా అమృత సంతానమనీ గుర్తుపడతారని తలుచుకుంటేనే నాకు ఒళ్ళు పులకరిస్తూ ఉంది
