రామకృష్ణారావుగారు గిడుగు రామ్మూర్తిగారి మునిమనమడు. గిడుగు సీతాపతిగారి మనమడు. అలా ఆ ఇద్దరిగురించి సాధికారికంగా మాట్లాడటానికి అన్ని విధాలా అర్హుడు. ఆయన తమ కుటుంబాల్లో పిల్లలకి తమ తాతల గురించి చెప్తున్నట్లుగా ఈ పుస్తకం రాసినప్పటికీ ఇది తెలుగు పిల్లలందరికోసం రాసినట్టే. ఒక్క పిల్లలేమిటి? తెలుగు వాళ్ళందరికోసం రాసినట్టే.
ఇద్దరు మహనీయులు
ఆదివారం సంజీవదేవ్ శతజయంతి ఉత్సవాలు హైదరాబాదులో మొదలయ్యాయి. హైదరాబాదు స్టడీ సర్కిల్లో జరిగిన సమావేశంలో చాలామంది కవులు, కళాకారులు, పత్రీకాసంపాదకులు ఆయన్ని తలుచుకున్నారు.
