ఫ్రాన్సిస్ పూర్తిగా భగవత్ భిక్షువుగా జీవించాడు. లేమి అతడి మతం. దానిలో అతడికి ఎటువంటి రాజీనీ కోరుకోలేదు.
బసవన్న వచనాలు-4
భారతీయ సామాజిక చరిత్రలో ఇలా ఆత్మ వంచననీ, కాపట్యాన్నీ దుమ్మెత్తిపోసినవాళ్ళల్లో బసవన్ననే మొదటివాడని గమనిస్తే, పన్నెండో శతాబ్దంలోనే అటువంటి నిరసన ప్రకటించడంలోని నిజాయితీ, నిర్భీతీ మనల్ని ఆశ్చర్యానికి గురిచేస్తాయి. అటువంటి మానవుణ్ణి ఆరాధించకుండా ఉండలేమనిపిస్తుంది
చలంగారి సుశీల
సుశీలకి సులేమాన్ తో కలిగిన ప్రేమానుభవం, టాగోర్ మాటల్లో చెప్పాలంటే, గ్రీకు నగరం స్పార్టా అభిలాషలాంటిది. అది సంకుచితం. వారిద్దరికే పరిమితం. నిజానికి అక్కడ ఇద్దరికి కూడా చోటు లేదు. అది ఇద్దరు ఒకరిగా మారి, చివరికి ఏ ఒక్కరూ మిగలని బాధానుభవం. నారాయణప్పతో ఆమెకి ఆ తరువాత సంభవించింది ఏథెన్సు నగరానికి సంభవించినటువంటిది. అది ప్రేమ తాలూకు అత్యున్నత స్థాయి.
