ఆరాధించదగిన ప్రేమ యేది?

గౌరునాయుడూ, ఈ పూట మీరూ, మన మిత్రులంతా గురజాడ అప్పారావుగారిని తలుచుకోడానికి పార్వతీపురంలో కలుసుకుంటున్నారు. నన్ను కూడా పిలిచారు, ఎంతో ప్రేమతో. కాని రాలేకపోయాను, 'అయినా చదివి వినిపించుకుంటాం, నాలుగు మాటలు రాసి పంపండి' అన్నారు. నా హృదయం అక్కడే ఉందనుకునే ఈ నాలుగు మాటలూ రాస్తున్నాను, లేదు, మీ మధ్య కూచుని మీతో చెప్పుకుంటున్నాను.