మామూలుగా మనం మన స్నేహితులమీద అలగడానికీ, దెప్పిపొడవడానికీ, మామూలుగా దాంపత్యజీవితాల్లో సంభవించే పోట్లాటలకీ బ్లాక్ మెయిల్ కీ తేడా ఏమిటంటే, రెండోది ఒక ధోరణిగా, pattern గా మారిపోవడం. చిన్న చిన్న అలకలు పూనినప్పుడల్లా అవి వెంటనే ఆశించిన ఫలితాలు ఇవ్వడం చూసి పదే పదే అలకపూనుతుంటే అదొక ధోరణిగా మారిపోవడం బ్లాక్ మెయిల్ అవుతుంది
ఎమోషనల్ బ్లాక్ మెయిల్-1
అసలు నిన్నటిదాకా ఎంతో ప్రేమాస్పదంగా, ఆరాధనీయంగా, సమ్మోహకరంగా కనిపించిన వ్యక్తి ఉన్నట్టుండి వికృతంగా ఎందుకు కనిపిస్తున్నాడో లేదా కనిపిస్తున్నదో మనకి అర్థం కాదు. మనం ఆ అనుబంధాన్ని కొనసాగించలేకా, వదులుకోలేకా పడే నరకయాతననుంచి మనల్ని మనమెలా బయటపడేసుకోవాలో కూడా తెలియదు.
