ఒక స్వాతంత్య్రపోరాటానికి ఒక ప్రభుత్వం ఎప్పటికీ నాయకత్వం వహించలేదు. అది ప్రజలే నడుపుకోవలసిన ఉద్యమం. ఆ మాటే చెప్పాను ఆ రోజు- పుస్తకాల పట్లా, గ్రంథాలయాల పట్లా ఆసక్తి పునరుజ్జీవం కావాలంటే మనం చూడవలసింది ప్రభుత్వం వైపూ, ప్రభుత్వోద్యోగుల వైపూ కాదు, ప్రజలవైపు, ముఖ్యంగా తల్లిదండ్రులవైపు అని చెప్పాను.
ఇవన్నీ చెప్పాలి పిల్లలకి
ఏమీ అక్కర్లేదు, కనీసం కళాశాల వార్షికోత్సవానికి ఒక నాటకం వెయ్యడానికి పూనుకున్నా కూడా కలిసి పనిచెయ్యడంలో ఉండే ఉత్సాహాన్ని , అది పిల్లలకి రుచిచూపిస్తుంది. ఒకరినొకరు అర్థం చేసుకుని, ఒకరి సామర్థ్యాల్నీ, బలహీనతల్నీ కూడా మరొకరు సహానుభూతితో చూడగల సంస్కారాన్ని అలవరుస్తుంది.
