ఇది ఒక శోకగీతం. నిండుయవ్వనంలో ఉన్న తన కొడుకుని పోగొట్టుకున్న ఒక తండ్రి కన్నీటిపాట. ఆ యువకుడు అందగాడు, బుద్ధిమంతుడు, ఇతరులని నొప్పించనివాడు. నలుగురికీ స్నేహపాత్రుడు. ఒక్కమాటలో చెప్పాలంటే సాకేతరాముడే. అటువంటి రాముడికి దూరమైన ఒక దశరథుడి వ్యథ ఇది.
డా. రాధేయ
తన సొమ్ము, తన కష్టార్జితం, తన పిల్లలకోసం దాచివుంచుకోవలసిన డబ్బుతో, ప్రకటనలిచ్చి, కవిత్వసంపుటాల్ని ఆహ్వానించి, న్యాయనిర్ణేతలని వెతికి పట్టుకుని, పుస్తకాలు ఎంపికచేసి, తాను ఎక్కడ పనిచేస్తే అక్కడే సభలు నిర్వహించి, ఆ ఆ కవుల్ని యథాశక్తి సత్కరించి-ఇట్లానే మూడు దశాబ్దాలు గడిపేడు.
