అవును. నరకాన్ని కూడా ధిక్కరించగలవి పువ్వులు మాత్రమే. వాటికి తెలుసు, జీవించేది ఒక్కరోజు మాత్రమే. వాటికి మృత్యుభయం లేదు. రేపెలా గడుస్తుందన్న చింతలేదు. ఈ సాయంకాలానికి వాడి నేలరాలిపోతామన్న దిగులు లేదు. వాటికి తెలిసింది ఒక్కటే, ఆ క్షణం, తాము విప్పారుతాయే, ఆ క్షణం, తమ సమస్త అస్తిత్వంతో, ఆనందంతో, లోపల్నుంచీ ఉబికి వచ్చే ధగధగతో, పూర్తిగా, పరవశంతో, అజేయమైన ఆత్మబలంతో, తాము తాముగా పూర్తిగా విప్పారడం. అలా విప్పారిన క్షణం అవి భూమ్మీద స్వర్గాన్ని వికసింపచేస్తాయి. ఆ తర్వాత అవి ఉంటే ఏమిటి? రాలిపోతే ఏమిటి? కనీసం ఆ క్షణం, ఆ ఒక్క క్షణం, నరకలోకం తలుపులు మూసుకుపోతాయి.
అమృతానుభవం
పరతత్త్వం జ్ఞానం, జ్ఞాని కాదు. పరమాత్మ వెలుగునిచ్చేవాడు కాదు, వెలుగు. భగవంతుడు ప్రేమించడు. భగవంతుడు ప్రేమ. ప్రేమించడానికి మరోవస్తువు లేని స్థితిని భగవంతుడు అంటారు
