ఇవన్నీ విన్నాక విజయభాస్కర్ ని ఆయన జీవితానుభవాలు కూడా ఒక పుస్తకంగా వెలువరించమని అడిగాను. నేటి కాలానికి, నేటి దేశానికి కావలసింది ఇటువంటి జీవితాలూ, ఇటువంటి జీవితచరిత్రలూనూ.
సృష్టిగర్భ: ఉపనిషత్కాంతి
దీర్ఘాసి విజయభాస్కర్ కవిగా, రచయితగా, నాటకకర్తగా, సమర్థుడైన అధికారిగా ఇప్పటికే తెలుగుప్రపంచానికి పరిచయం. ఎన్నో ప్రతికూల పరిస్థితుల్ని దాటి ఆయన ఈ స్థితికి చేరుకోవడమే ఒక జయగాథ, అతడు పుట్టిపెరిగిన ప్రాంతానికీ, ఆ కుటుంబాలకీ మాత్రమే కాదు, మనందరికీ కూడా. కానీ అతడు ఇంతదాకా అధిరోహించిన ఎత్తులు ఒక ఎత్తు. ఈ పుస్తకం ద్వారా చేపట్టిన ఆరోహణ మరొక ఎత్తు.
కళింగాన్వేషణ
డా. విజయభాస్కర్ కవి, నాటకకర్త కూడా. ఇతిహాసపు చీకటికోణం అట్టడుగున పడి కనిపించని ఎన్నో కథల్ని ఆయన మనముందుకు తీసుకొచ్చారు. ఇప్పటిదాకా అప్రధానీకరణకు గురయిన సమూహాలకు సాహిత్యంలో సముచిత స్థానాన్ని సంపాదించే క్రమంలో ‘రాజిగాడు రాజయ్యాడంట’ పేరిట ఆయన రాసిన నాటకం గొప్ప ప్రయోగం. ఇప్పుడు ఆయన నవలారచయితగా కూడా ఈ నవలతో మనముందుకు వస్తున్నారు.
