ఇంకొంచెం సూర్యకాంతి

ఇంకొంచెం సూర్యకాంతి విడుదల చేసాక నాకు లభించిన రెండవ స్పందన ఇది. మొదటి స్పందన పంచుకున్నందుకు సోమశేఖర్ కీ, ఆత్మీయమైన ఈ వాక్యాలు రాసినందుకు వీణావాణిగారికీ హృదయపూర్వక ధన్యవాదాలు.

పాలమూరు అడవిదారిన-2

కాని మాఘమాసపు అడవి ఉందే, అది పూర్తిగా అంతర్ముఖీన భావుకత. తనలోకి తాను ఒదిగిపోయి ఉండే ఒక జెన్ సాధువు అంతరంగంలాంటిది. ఒక యోసా బూసన్ హైకూ లాంటిది, సంజీవ దేవ్ పేస్టల్స్ చిత్రలేఖనం లాంటిది. ఏక్ తార మీటుకుంటూ పాడుకునే బైరాగి తత్త్వం లాంటిది.

పాలమూరు అడవిదారిన-1

‘అడవిమీద కాసిన వెన్నెల వృథాకాదు, అదే అత్యంత ఫలవంతమైన వెన్నెల’ అన్నారు వీణావాణి. ‘పండ్లలో రసం, కంకుల్లో పాలు, గింజల్లో పుష్టి ఊరేదంతా వెన్నెల్లోనే’ అన్నారామె.