పోస్టు చేసిన ఉత్తరాలు-1

ఇప్పుడు నాకెంత బలంగా అనిపిస్తోందో తెలుసా, నా తోటలో పూసిన ప్రతి కొత్తపువ్వుతోనూ నీకొక కవిత పంపాలని. ఇప్పుడు యవ్వనోధృతిలేదు. ఈ ప్రపంచాన్ని మార్చాలన్న అమాయికత్వమూ లేదు. ఎవరితోటీ వాదించే ఉత్సాహమూ లేదు. ఒకరిని అవుననాలని లేదు, ఒకరిని కాదనాలని లేదు. అసలు ఎవరో ఒకరితో ఏమీ మాట్లాడాలనీ లేదు.