సర్వోత్తమ దార్శనికుడు

వేమన గురువు అంటే సాంప్రదాయిక అర్థంలో గురువు మాత్రమే కాదు. ఇప్పుడు మనకి అత్యవసరమైన జీవనవిద్యను ప్రతిపాదిస్తున్న గురువు అని కూడా. అంటే, చాలా మనకి సుపరిచితంగా, ఇంక వాటిల్లోంచి కొత్తగా ఏ అర్థాలూ స్ఫురించడానికేమీ లేదనే పద్యాల్లో కూడా వేమన మనకి సరికొత్తగా వినిపిస్తున్నాడు.

పెదకళ్ళేపల్లి

ముప్పై ఏళ్ళు పైబడి ప్రభుత్వంలో పనిచేస్తున్నాను. కాని తనకి వచ్చిన అర్జీ మీద ఒక పద్యంతో ఎండార్స్మెంటు రాయవచ్చునని తెలిసినవాడు నాతో సహా ఒక్క అధికారి కూడా లేడు!