నినాదాలు, ప్రచారాలు, అనుకరణలు, పొగడ్తలు, తెగడ్తలు కవిత్వంగా చెలామణి అవడం మొదలుపెట్టాయంటే ఆ జాతి ధ్వంసం అవుతున్నట్టు. నిరలంకారంగా, సూటిగా పలికే ఒక చక్కనిమాటకి శ్రోతల హృదయాలు స్పందిస్తున్నాయంటే ఆ జాతికి మంచిరోజులు వచ్చినట్టు.
సత్యాన్ని దర్శించిన ధైర్యం
తన మరణానంతరం వెలువడిన ఈ నవలతో గంగాధర్ తనకు తెలియకుండానే తెలుగు భాషను రాత్రికి రాత్రి ఆత్యాధునిక ప్రపంచభాషగా మార్చేసాడు.
