మార్తా

ఆయన జీవించిన జీవితం అంటే బ్రహ్మసమాజం రోజులనుంచీ, అరుణాచలంలో తొలినాళ్ళదాకా, మార్తా లాగా 'చాలా విషయాల గురించీ 'పట్టించుకున్న' జీవితం, చాలావాటి గురించి 'ఆందోళన చెందిన' జీవితం. కాని మరియలాగా నిజంగా పట్టించుకోవలసినవి కొన్ని మాత్రమేననీ, ఆ మాటకొస్తే ఒకే ఒక్కటి మాత్రమేననే మెలకువ కలుగుతున్న కాలంలో ఆయన ఈ నవల రాసారు.

బాలబంధు

మొన్న ఇంటికి వచ్చేటప్పటికి దేవినేని మధుసూదనరావుగారినుంచి ఒక పార్సెలు వచ్చిఉంది. విప్పి చూద్దును కదా, బి.వి.నరసింహారావుగారి సమగ్రరచనలు మూడు సంపుటాలు! నా ఆశ్చర్యానికీ, ఆనందానికీ అంతులేదు.