కవిగా చాసో సాధించిన అద్భుతమైన పరిణతి 'మాతృధర్మం' కథలో కనిపిస్తుంది. చలంగారి 'ఓ పువ్వు పూసింది' రొమాంటిసిస్టు సంప్రదాయంలోంచీ, 'మాతృధర్మం' రియలిస్టు సంప్రదాయంలోంచి వికసించినా రెండూ కూడా ఒక్కస్థాయినే అందుకున్న కథలు. ఆ కథలతో తెలుగుకథ శిఖరాగ్రాన్ని చేరుకుంది
