కాని ఇప్పుడు నిజమైన ప్రార్థన అంటే ఏమిటో తెలిసింది. తెల్లవారి లేచి నువ్వు దైవాన్ని ఏమీ కోరుకోనక్కర్లేదు. నువ్వు చెయ్యవలసిందల్లా ధన్యవాదాలు చెప్పుకోవడమే. మరొక ప్రభాతం నీకు లభించినందుకు. మరొక రోజు నీకు దక్కినందుకు. మరొకసారి దైవాన్ని తలుచుకోగలినందుకు.
దివ్యస్పర్శ
మన చుట్టూ ఉన్న సమాజంలో ఇటువంటి మాటలు మాట్లాడగలిగిన వారు ఎవరేనా ఉన్నారా? నిత్యం తన విశ్వాసాన్ని తాను బలపర్చుకోడానికే ప్రయత్నిస్తూనే ఉన్నాననీ, ఆ ప్రయాణంలో తన సందేహాలు తనని అడ్డగించలేవనీ చెప్పగలిగేవారున్నారా?
