ఇక ఈ పుస్తకం తమ చేతులదాకా చేరిన యువతీయువకులు మాత్రం నిజంగా భాగ్యవంతులు. ఎందుకంటే, అంధకారం దట్టంగా కమ్ముకుని ఉన్న ఈ లోకంలో మీ జీవితానికి అర్థం చెప్పుకోగల అరుదైన అవకాశం మీ చేతుల్లోనే ఉందని మీకు స్ఫురిస్తుంది.
ఒక ఫీల్డ్ వర్కర్ డైరీ
ప్రజలతో కలిసి పని చేయటంలోని సంతోషం సరే, అలా పని చేయటంలో సంప్రాప్తించే అనుభవాలు ఆమెను ఎంత వివేకవంతురాలు చేశాయో ఈ పుస్తకంలో ప్రతి వ్యాసం సాక్ష్యం ఇస్తోంది. నేను కలగనే భారతదేశాన్ని నిర్మించగల చేతులు ఇటువంటి మనుషులవే అని నాకు మరోసారి నమ్మకం కలిగింది.
