నన్ను వెన్నాడే కథలు-7

ప్రసిద్ధ చలనచిత్ర దర్శకుడు, కథకుడు వంశీ ఒకసారి నాతో మాటల మధ్య స్టాన్లీ కుబ్రిక్ గురించి ఒక మాట చెప్పారు. చాలామంది దర్శకులు ఇప్పటికీ తాము సినిమాలు తీయబోయేముందు స్ఫూర్తికోసం ఆయన సినిమాలు వేసుకుని చూస్తూ ఉంటారట. కథారచన వరకూ నేను ఈ మాట టాల్ స్టాయి గురించి చెప్పగలను.