బసవపురాణం-9

తాను శివశరణుల తొత్తుననీ, లెంకననీ బసవణ్ణ తన కవిత్వంలో పదే పదే చెప్పుకున్నాడు. అటువంటి కవిత్వం చదువుతున్నప్పుడు మనలో ఒక వైపు అటువంటి మహామానవుడు మేల్కొంటూ మనలోని లఘుమానవుడు అణగిపోతూ ఉండటం మనకి అనుభవానికొస్తుంది.