28-2-2025 న ఫేస్ బుక్ లైవ్ ప్రసంగంలో అస్తిత్వ విచికిత్సకు లోనైన మానవుడి జీవన్మరణ ప్రశ్నలను బైరాగి ఏ విధంగా పరిశీలనకు పెట్టాడో మరొకసారి వివరంగా చర్చించాను. ఈ ఆరు ప్రసంగాలతో బైరాగి మూడు కవితలపైన చర్చ పూర్తయ్యింది.
బయటపడాలి
ముఖ్యంగా నువ్వు నీ తోటి మనిషిని నీ ప్రయత్నాల్లో ఒక భాగంగా స్వీకరిస్తున్న ప్రతిసారీ ఏదో ఒక రూపంలో అతణ్ణి నియంత్రించడానికి పూనుకుంటావన్న ఎరుక కలగగానే అది నిన్ను పెట్టే ఆత్మ హింస సాధారణంగా ఉండదు.
ఒక ఆంతరంగిక సమాధానం
ఈ లోకంలో నేను కూరుకుపోకుండా, ఇక్కడి శక్తులకీ, వస్తువులకీ బానిసని కాకుండా ఉండగలిగానంటే, ఈ సముద్రం ఒడ్డున ఒక పడవలాగా ఆ శ్లోకసారాంశం నా మనసులో నిలిచిపోవడమే కారణమనుకుంటాను.
