ముందు మనం పాఠకులుగా మారాలి

ఇదంతా చదివిన తరువాత మీకేమనిపిస్తున్నది? మనం కవిత్వాన్ని చదవవలసినట్టుగా చదవడం లేదనే కదా. కవిత్వం చదవడానికి మనకి కావలసింది అన్నిటికన్నా ముఖ్యం కాలం. ప్రతి ఒక్క పదప్రయోగం దగ్గరా ఆగిపోగలిగే, జీవితాన్ని అంకితం చేయగలిగే మనఃస్థితి. ఇప్పుడు మనకి కావలసింది, మరింత మంది కవులు కాదు, మహాకవులు అసలే కాదు, మనకి కావలసింది పాఠకులు.