బసవపురాణంలో ముగ్ధభక్తుల కథల గురించి చేస్తూ వచ్చిన ప్రసంగాలకు కొనసాగింపుగా ఇవాళ బసవణ్ణ భక్తి గురించిన ప్రసంగం.. బసవణ్ణది ముగ్ధభక్తి కూడా. ముగ్ధభక్తులు శబ్దప్రమాణాన్నే విశ్వసించి నడుచుకున్నారు. పెద్దలు శివుడి గురించి ఏ మాట చెప్తే ఆ మాటనే వాళ్ళు శిరోధార్యం చేసుకున్నారు. బసవణ్ణ కూడా అలానే తన గురువు సంగమయ్య తనకు చేసిన ఉపదేశానికి అనుగుణంగానే తన నడవడికను, తన వాక్కుని రెండింటినీ తీర్చిదిద్దుకున్నాడని బసవపురాణం చెప్తున్నది. ఆ విశేషాలు ఈ రోజు ప్రసంగం.
బసవ పురాణం-6
ముగ్ధత్వం మనందరం మన జీవితాల్లో ఏదో ఒక సందర్భంలో అనుభవించే ఉంటాం. కాని అది మనకి క్షణకాలపు అనుభవంగా మాత్రమే ఉండి ఇంతలోనే మన రోజువారీ మెలకువల్లో పడగానే కలలాగా కరిగిపోతుంది. కాని ముగ్ధభక్తులకి అది జీవితసారాంశం.
బసవ పురాణం-5
తెలుగు పాఠకుల్లో కూడా చాలామందికి రూమీ గురించి తెలిసినంతగా సోమన గురించి తెలియదు. కాని కావ్యనిర్మాణ పద్ధతుల్లోగాని, కథనశైలిలోగాని, ఈశ్వరదర్శనం ఏ కొద్దిమంది పండితులకో కాకుండా ప్రజలందరికీ సుసాధ్యమేనని నమ్మడంలోనూ, చెప్పడంలోనూ కూడా సోమన, రూమీ ఒక్కలాంటివారేనని చెప్పడం ఈ రోజు ప్రసంగం ముఖ్యోద్దేశం.
