ఒక్క కథ, ఒక్క సంఘటన, ఒక్క అనుభవం- ఒక్కటి చాలు, మనుషుల పట్ల, మనుష్య ప్రయత్నాల పట్ల మన నమ్మకాన్ని బలపర్చడానికి. అటువంటి అనుభవాలు కొన్ని వేలు ఉండవచ్చు మనందరికీ. కానీ, వాటిల్లో ఎన్ని కథలుగా మారుతున్నాయి? ఎన్ని సినిమాలుగా నోచుకుంటున్నాయి?
బన గర్ వాడి
ఇన్నాళ్ళకు మరొకసారి బనగర్ వాడి చదివాను. దాదాపు నలభై అయిదేళ్ళ తరువాత. ఆ పసిప్రాయంలో నన్నంతగా లోబరుచుకున్న ఆ ప్రాశస్త్యం ఆ నవలదా లేక అప్పటి నా నిష్కళంక హృదయానిదా లేక తాడికొండ పాఠశాలదా అని పరిశీలనగా చదివాను. అదంతా ఆ కథలోని నైర్మల్యమని నాకిప్పుడు బోధపడింది.
