నా కవిత్వ ప్రయాణం

కరోనా కాలంలో మిత్రులు కొంతమంది నన్ను ఒక జూమ్ సమావేశానికి పిలిచి కవిత్వం గురించి మాట్లాడించారు. 22-10-2020 న జరిగిన ఆ సమావేశం యూట్యూబ్ లింక్ ఈ మధ్య డా.సుంకర్ గోపాల్ నాకు పంపించారు. ఇవాళ ఆ లింకు తెరిచి విన్నాను. ఆసక్తికరంగానే అనిపించింది.

ప్రళయాంతవేళ

ప్రళయం ముంచెత్తిన ప్రతి యుగాంతవేళా, నాతో పాటు, వటపత్రప్రమాణంకలిగిన కించిదూర్జిత స్ఫూర్తికూడా ఒకటి జీవించి ఉండటం కనుగొన్నాను

ఎర్రక్రీస్తు-2

గతవారం బైరాగి 'ఎర్రక్రీస్తు' కవితమీద నా ఆలోచనలకు ప్రతిస్పందించిన మిత్రులందరికీ నా అభినందనలు. అయితే ఆ కవితమీద, నా వ్యాఖ్యానం మీద కొందరు మిత్రులు ప్రకటించిన సందేహాలకు కొన్ని వివరణలు ఇప్పుడు ఇవ్వాలనుకుంటున్నాను.