ఈ మార్పుల వల్ల బైరాగి మూలకవితను మరింత ప్రభావశీలంగా, మరింత ఫలప్రదంగా తీర్చిదిద్దాడని చెప్పవచ్చు. వృత్తపద్యాల వల్ల, ఆ అపురూపమైన శయ్యవల్ల, తన వేడికోలులో ఒక అవిచ్ఛిన్నతను, తెంపులేనితనాన్ని, ఏకోన్ముఖతను ఆయన అనితరసాధ్యంగా తీసుకురాగలిగాడు.
వర్షాయామిని
కొన్ని చాలా ఆశ్చర్యంగా ఉంటాయి. ఆ క్షణం కోసమో లేదా ఆ కల నెరవేరడంకోసమో ఏళ్ళకి ఏళ్ళు వేచి చూస్తూ ఉంటాం. ఈలోపు మనం కళ్ళు తెరిచిమూసేలోపే మన కల నిజమై సాక్షాత్కరిస్తుంది, మన కళ్ళని మనమే నమ్మలేనట్టుగా, మన చెవుల్ని మనమే నమ్మలేనట్టుగా.
అసంకల్పిత పద్యం
ఇది రఘు తీసుకువచ్చిన తొమ్మిదవ సంపుటి అయినప్పటికీ నేను ఆయన కవిత్వం చదవడం ఇదే మొదటిసారి. కాబట్టి, ప్రధానంగా మూడు అంశాలమీద నా అభిప్రాయాల్ని క్లుప్తంగా చెప్పాను. ..
