నానృషిః కురుతే చిత్రమ్

తన జీవితకాలంపాటు రెడ్డిగారు చేస్తూ వచ్చిన సాధనకి నమూనాగా చెప్పదగ్గ 120 వర్ణచిత్రాలున్నాయిందులో. ఈ బొమ్మలన్నీ ఒక్కచోట చూసినప్పుడు చాలా భావాలు స్ఫురిస్తూ ఉన్నాయి. కాని మూడు అంశాల్ని మాత్రం ఇక్కడ మీతో పంచుకోవాలని ఉంది. ..

కమ్మరి కొలిమీ, కుమ్మరి చక్రం

నాకు ఆ క్షణాన నా చిన్నప్పుడు మా ఊళ్ళో కుమ్మరులుండే వీథి గుర్తొచ్చింది. రెండుమూడు కుటుంబాలే ఉండేవారుగాని, ఆ ఇళ్ళన్నీ ఒకదానికొకటి గొలుసుకట్టుగా ఉండేవి. ఆ ఇళ్ళకు ఒక పక్కగా ఆవం. అందులోంచి ఎప్పుడూ ఆరని పొగ. కొత్తగా చేసిన కుండలు, కాల్చిన కుండలు, పగిలిన కుండలు, గాలికి రేగే ఊక నుసి- ఆ ప్రాంతమంతా ఒక కార్ఖానా లాగా ఉండేది. నా జీవితంలో నేను చూసిన మొదటి ఇండస్ట్రియల్ ఎస్టేట్ అది.

రూపాన్వేషి, మార్గదర్శి

బి.ఎ.రెడ్డి ఒక చిత్రకారునిగా, ఒక ఉపాధ్యాయునిగా సాధించిన అద్వితీయత విశిష్టమైంది. అందులో ఆయన చిత్రకారునిగా చూపిన అద్వితీయత ప్రశంసించదగ్గది. ఉపాధ్యాయునిగా చూపిన అద్వితీయత ప్రస్తుతించదగ్గది.