పుస్తక పరిచయం-16

పుస్తక పరిచయం ప్రసంగ పరంపరలో భాగంగా టాగోర్ సాహిత్యం పైన చేస్తూ వస్తున్న ప్రసంగాల్లో ఇది ఆరవది. ఈ రోజు టాగోర్ కవిత్వ సంపుటి 'బలాక' (1914) పైన ప్రసంగించాను.

జీవన్మృత్యువుల సరిహద్దులో

ఒక కవి, ఒక గాయకుడు మృత్యువుకు ఎదురేగే పద్ధతి అది కాదు. బహుశా ఒక యోగిని, ఒక ఉపాసకుణ్ణి మృత్యువు ఒక్కసారిగా చంకనపెట్టుకుపోలేదేమో. ఈ ప్రపంచంతో పూర్తిగా ముడివడ్డ ఒక జీవితప్రేమికుడి బంధాలు తెంచడం మృత్యువుకి ఒకపట్టాన చాతకాలేదేమో!