శ్రీ లక్ష్మణమూర్తి

శ్రీ లక్ష్మణమూర్తిగారు ఇటీవల స్వర్గస్థులయ్యారన్న వార్త చాలా ఆలస్యంగా తెలిసింది. ఆయన్ని నేను ఒకే ఒక్కసారి కలుసుకున్నాను, అది కూడా ఇరవయ్యేళ్ళ కిందట. కానీ ఆ ఒక్క సమావేశమే ఆయనతో ఒక జీవితకాలం గుర్తుపెట్టుకునే సాహిత్యానుభవాన్నిచ్చింది. ఆ విశేషాలు అప్పట్లో తెలుగు ఇండియా టుడే లో 'సాలోచన' లో పంచుకున్నాను. ఆ తర్వాత ఆ వ్యాసం 'సోమయ్యకు నచ్చిన వ్యాసాలు' పుస్తకంలో పొందుపరిచాను. ఇప్పుడు ఆయనకు నివాళిగా ఆ వ్యాసాన్నిక్కడ మరోమారు మీతో పంచుకుంటున్నాను.

కవిత్వహిమాలయ సంచారి

ఇంగ్లిషులో phenomenon అని ఒక పదం ఉంది. కంటికి కనిపించే ఒక యథార్థమైన విషయం అనే అర్థంలోనే కాకుండా, మనల్ని అబ్బురపరిచే ఒక మనిషిని సూచించడానికి కూడా ఆ మాట వాడతారు. నాగరాజు రామస్వామిగారిని అభివర్ణించాలంటే ఆయన ఒక phenomenon అని అనాలి