తన గురువునుండి పొందిన ఆ ప్రేమని ఇప్పుడాయన తిరిగి మళ్ళా ధారాళంగా వెదజల్లుతున్నారు కాబట్టే వేలాదిమంది శిష్యులు ఆయన సన్నిధి నుంచి స్పూర్తి పొందుతున్నారు. విద్యావంతులైన నాగరికులు తమ శక్తియుక్తులన్నీ మనుషుల్ని మతాల పేరిట విడదీయడానికి చూస్తుంటే, ఇక్కడ, ఈ సూఫీ సంప్రదాయ రామదాసును ఆశ్రయించుకున్న గ్రామీణులు మతాలకు అతీతమైన ఒక ప్రేమసమాజంగా జీవిస్తున్నారు.
