అతడు వాటిని నాలుగు లక్షల ఏళ్ళ కాలానికి సంబంధించినవిగా చెప్తూ ఒక ముఖ్యమైన మాట చెప్పాడు. అదేమంటే పురావస్తు శాస్త్రంలో పురావస్తు అవశేషాల కాల నిర్ధారణ ఎంతో ఖర్చుతో కూడుకున్న పని అని, ఆ కాలనిర్ధారణకు అవసరమయ్యే వ్యయాన్ని ఖర్చు పెట్టడానికి ప్రభుత్వాలు గాని సంస్థలు గాని ముందుకు రాగలినప్పుడే ఆ ప్రాంతం తాలూకు పురాచరిత్ర నలుగురికి మరింతగా తెలిసే అవకాశం ఉంటుందని చెప్పాడు.
2,47,000 ఏళ్ళ నాటి మాట
ఇదంతా నాకైతే నాకు కొత్త ప్రపంచంగా అనిపించింది. కాని అది మనమధ్యనే మరుగున పడి ఉన్న ప్రపంచం. తెలుగువాళ్ళు గర్వించవలసిన నిజమైన సందర్భాలంటూ ఉంటే అవి ఇలాంటి ఆవిష్కరణలు వెలుగు చూసిన సందర్భాలు.
