ఆంధ్ర గద్య చంద్రిక

తెలుగులో పద్య సంకలనాలు ఉన్నట్లుగా గద్య సంకలనాలు చాలా తక్కువ. తెలుగు కవిత్వాన్ని 'కావ్యమాల' (1959) పేరిట సాహిత్య అకాదెమీ కోసం కాటూరి వెంకటేశ్వర రావుగారు ఒక సంకలనం తీసుకొచ్చారు. అయితే అందులో కవుల ఎంపిక, పద్యాల ఎంపిక మొత్తం మల్లంపల్లి శరభయ్యగారే చేసారు.