ఆబాలగోపాల తరంగం

ఆ ఒక్క ప్రశ్న ఒక తేనెతుట్టెని కదిపినట్టయింది. ఎక్కడెక్కడి జ్ఞాపకాలూ, ఎక్కడెక్కడి మిత్రులూ, ఎప్పటెప్పటి కవిత్వాలూ గుర్తొచ్చాయి. 'మహాసంకల్పం' నుండి ట్రాన్స్ ట్రోమర్ దాకా. బైరాగి నుంచి కవితాప్రసాద్ దాకా.

ప్రతి ఒక్కరిదీ ఒక జయగాథ

నిన్న ఆ సభకి హాజరై తమ అనుభవాల్ని పంచుకున్న ప్రతి ఒక్కరూ వింటున్నవాళ్ళల్లో ఉత్తేజాన్ని ప్రవహింపచేసారు. వాళ్ళల్లో ప్రతి ఒక్కరిదీ ఒక జయగాథ. తెల్లవారిలేస్తే ద్వేషంతోనూ, ట్రోలింగుతోనూ కుతకుతలాడిపోతుండే మీడియాలోనూ, సోషల్ మీడియాలోనూ కనిపించని కథలు, వినిపించని విజయాలు.