మరికొన్ని కలయికలు

నేను ఆ పుస్తకాన్ని చేతుల్లోకి తీసుకుని మళ్ళా ఒక్కసారి ఆ గ్రంథాలయం మొత్తం కలయచూసాను. అక్కడ కేవలం రామాయణాలే ఆరు రాకులకు సరిపడా ఉన్నాయి. వేదాలు, వేదాంతం, దర్శనాలు, వ్యాఖ్యానాలు- ఆ భాండాగారాన్ని ఉపయోగించుకునేవారేరీ? కనీసం రోజూ ఆ గ్రంథాలయంలో గడపడం కోసమేనా నాకు ఆ క్షణాన నా నివాసం తిరుపతికి మార్చేసుకోవాలనిపించింది.