నెడు నల్ వాడై గురించి రాస్తూండగా సినిమా సాంకేతిక పరిభాష వస్తోంది కదూ. ఆశ్చర్యం లేదు. చాలా ఏళ్ళకిందట ఈ కవిత మొదటిసారి చదివినప్పుడు ఇదంతా ఒక పెద్ద తైలవర్ణ చిత్రంలాగా కనిపించింది. కాని ఇప్పుడు లైటింగ్ గురించి బాగా తెలిసిన ఒక సినిమాటోగ్రాఫర్ తీసిన చిత్రంలాగా కనిపిస్తోంది.
ఆషాఢమేఘం-11
ముల్లైప్పాట్టు ఒక సాధారణ ప్రణయ కవిత స్థాయి నుంచి ఒక శుభాకాంక్షగా మన కళ్ళముందు ఎదిగిపోతుంది. మేఘసందేశంలో కాళిదాసు ప్రణయవార్తకీ, శుభాకాంక్షకీ మధ్య సరిహద్దుని చెరిపేసాడని టాగోర్ అంటున్నప్పుడు, కాళిదాసుకన్నా ఎంతో కాలానికి పూర్వమే ఒక ప్రాచీన తమిళ కవి ఆ పని చేసాడని ఆయనకు తెలీదు!
