దిజ్ఞాగుడి విశిష్టత ఎక్కడుందంటే అతడు ఆమెని అంటిపెట్టుకున్న ఆ మట్టివాసన చెదిరిపోకుండా చూసుకున్నాడు. అతడు చిత్రించిన సీత ఒక మనిషి. నిస్సహాయ, నిర్దోషి సరే, ప్రేమ, ఇష్టం, ఉద్వేగం, ఉక్రోషం అన్నీ కలగలిసిన నిండు మనిషి. ఆ నాటకం పొడుగునా మనమొక నిజమైన స్త్రీని చూస్తున్న హృదయావేగానికి లోనవుతాం
ఒక విద్యావేత్త
నాలుగేళ్ళ కిందట అనుమాండ్ల భూమయ్య రచన చదివినప్పుడు నేనూహించిందీ, ఇప్పుడు యలవర్తి భానుభవాని పుస్తకం చూసినతరువాత బలపడిందీ, ఇప్పటి సమాజం వేమనను ఒక విద్యావేత్తగా, మార్గదర్శిగా చూడబోతున్నారన్నదే.
అల్పక్షణిక కుసుమ కళిక
కాని, బైరాగి బాధ్యత బదులు ప్రేమ గురించి మాట్లాడేడు. నువ్వూ, నీ తోటి మానవుడూ భగవంతుడి బిడ్డలు కాబట్టి మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలనడం పూర్వయుగాలు చెప్పిన మాట. నీ తోటిమనిషికి సామాజికంగా, ఆర్థికంగా, సాంస్కృతికంగా అన్యాయం జరుగుతోంది కాబట్టి నువ్వతణ్ణి ప్రేమించాలనడం ఆధునిక యుగాలు చెప్తున్న మాట.
