బాలబంధు

మొన్న ఇంటికి వచ్చేటప్పటికి దేవినేని మధుసూదనరావుగారినుంచి ఒక పార్సెలు వచ్చిఉంది. విప్పి చూద్దును కదా, బి.వి.నరసింహారావుగారి సమగ్రరచనలు మూడు సంపుటాలు! నా ఆశ్చర్యానికీ, ఆనందానికీ అంతులేదు.

క్షేత్రయ్య పదములు

నేను రాజవొమ్మంగి వెళ్ళినప్పుడు అక్కడ ఇంట్లో నా పాతపుస్తకాల్లో 'క్షేత్రయ్య పదములు' (1963) కనబడింది. విస్సా అప్పారావుగారు సంపాదకత్వం చేసిన పుస్తకం. రాజమండ్రిలో సరస్వతి పవర్ ప్రెస్స్ వాళ్ళు అచ్చువేసింది.

అల నన్నయకు లేదు

నూటొక్క డిగ్రీల వైరల్ జ్వరంతో మంచం మీద పడి కునారిల్లుతున్న నాకు ఒక జిజ్ఞాసువునుంచి రెండు మిస్డ్ కాల్స్. ఏమిటని పలకరిస్తే 'ఒక పద్యం రిఫరెన్సు కావాలి మాష్టారూ, విశ్వనాథ వారి పద్యం 'అల నన్నయకు లేదు, తిక్కనకు లేదా భోగము..'అనే పద్యం ఎక్కడిదో చెప్తారా' అని.