ఈశవిద్య

నేను సద్గురు జగ్గీవాసుదేవ్ అనుయాయిని కాను, ఆయన బోధనలపట్లా, సంభాషణలపట్లా నాకేమీ ప్రత్యేకమైన ఆసక్తి లేదు. ఆయన చెప్పే క్రియాయోగాన్ని అనుసరించడానికి ఆయన పట్ల గొప్ప నమ్మకం ఉండాలి, లేదా ఆయన్ని విమర్శించాలంటే, ఆయన ప్రత్యర్థుల్లాగా, ఆయన పట్ల బలమైన అనుమానాలేనా ఉండాలి. నాకు ఆ నమ్మకమూ లేదు, ఆ అనుమానాలూ లేవు.

గారపెంట ఆశ్రమపాఠశాల

గారపెంట ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలంలో ఒక మారుమూల చెంచుగూడెం. సుమారు ఇరవయ్యేళ్ళ కిందట మొదటిసారి ఆ వూరువెళ్ళాను. పుల్లలచెరువునుంచి అడవిబాటన అక్కడికి ఒక రోడ్డు వేయించాము. అక్కడొక ఆశ్రమపాఠశాల ఉంది. నల్లమల ప్రాంతంలో చదువుకుని పైకి వచ్చిన చెంచుయువతీ యువకులు ఆ ఊళ్ళోనే ఎక్కువ మంది కనిపించారు నాకు.

కలాం ఎఫెక్టు

కలాం ఆత్మకథను నేను అనువదించిన కొత్తలో, ఒక ప్రసిద్ధ విప్లవ రచయిత నాతో ఆ పుస్తకం గురించి మాట్లాడుతూ 'కలాం ప్రొడక్షన్ గురించి మాట్లాడినట్టుగా డిస్ట్రిబ్యూషన్ గురించి మాట్లాడలేదు కదా 'అన్నాడు.గ్లోబలైజేషన్ సందర్భంగా దేశంలో సంపద సృష్టి ముమ్మరమైన సమయంలో కలాం కూడా సంపద సృష్టించడం గురించి మాట్లాడేడు తప్ప, సృష్టించిన సంపద నలుగురికీ అందుబాటులోకి రావడం గురించీ, అసమానతలు తొలగిపోవడం గురించీ ఆయన మాట్లాడలేదనీ, పోరాడలేదనీ, ఆ రచయిత భావన.