సోమాజిగూడ మినర్వా కాఫీ షాపులో ఓ మధ్యాహ్నం టిఫిన్ చేద్దామని అడుగుపెట్టగానే నా మిత్రురాలొకామె చాలారోజుల తర్వాత కనిపించింది. మేమిద్దరం కుశలప్రశ్నలమీంచి మా పాతజ్ఞాపకాలు నెమరేసుకున్నాం. మాటలమధ్యలో, మేమొకప్పుడు, చార్మీనార్ దగ్గర చీరలమీద అద్దకం చేసే బ్లాక్ ప్రింటింగ్ కళాకారుల్ని వెతుక్కున్న ఒక సాయంకాలాన్ని కూడా తలుచుకున్నాం. ఆ అద్దకం గుర్తురాగానే ఆమె 'మీకో గొప్ప వ్యక్తిని పరిచయం చేస్తాను రండి ' అంటో, ఆ షాపింగ్ కాంప్లెక్సు మొదటి అంతస్థులోకి తీసుకువెళ్ళింది. మెట్లెక్కగానే మొదటిషాపే.
సృజనాత్మకత మూలాలు ఏమిటి
'ఆమె కన్నులలోన అనంతాంబరపు నీలినీడలు కలవు' అనే వాక్యాన్ని కవి ఎట్లా ఊహించగలిగాడు? అట్లాంటి మాటలు ఇంతదాకా మరొక కవి గాని లేదా మరో మనిషిగాని ఎందుకు పలకలేకపోయాడు? ఆ మాటలు మామూలు మాటలు కావు, కవిత్వమని మనకు తెలుసు.కాని అట్లాంటి కవితా వాక్యాలు మరొకరెవ్వరూ చెప్పలేరా? మనం పాఠశాలల్లో పిల్లలకి నేర్పలేమా? లేదా ఇప్పటి పద్ధతి ప్రకారం చెప్పాలంటే, ఒక ఇంటరాక్టివ్ యాప్ రూపొందిస్తే, ప్రతి ఒక్కరూ ఆ యాప్ వాడుకుని అట్లాంటి కవితావాక్యాలు సృష్టించలేరా?
ఇన్నొవేషన్ అసాధ్యం కాదు
గ్లోబలైజేషన్ యుగం మొదలయ్యాక అభివృద్ధికి రెండు వనరులు ప్రధానమని ప్రపంచమంతా గుర్తిస్తున్నారు. ఒకటి information, రెండోది, innovation. ఇన్నొవేషన్ అంటే కొత్త పుంతలు తొక్కడం. కానీ ఇన్నొవేషన్ ప్రైవేటు రంగంలోనూ, వాణిజ్యరంగంలోనూ తలెత్తినంతగా ప్రభుత్వరంగంలో ఇంకా ప్రస్ఫుటం కావడంలేదు. అందుకు చాలా కారణాలున్నాయి. ప్రభుత్వ వ్యవస్థలు సహజంగానే గతానుగతికంగానూ, కరడుగట్టిన ఆచారాలతోనూ కూడుకుని పనిచేయడం, ఇన్నొవేషన్ నువెన్నంటే రిస్క్ కూడా ఉన్నందువల్ల, ఆ రిస్క్ ని తలదాల్చడానికి ఎవరూ సిద్ధపడకపోవడం కొంత కారణం.
