నిన్నసాయంకాలం గుంటూరులో వైశ్య హాస్టల్లో బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి ఫౌండేషన్ తరఫున బాలాంత్రపు రజనీకాంతరావుగారికి విశిష్ట సేవా పురస్కారం అందించారు. ఆ సత్కార సభలో రజనీకాంతరావుగారితో వేదిక పంచుకోవడమే కాక, ఆయన గురించి మాట్లాడే అవకాశం కూడా నాకు కలిగింది. మరీ ముఖ్యంగా శ్రీకృష్ణమూర్తి ఫౌండేషన్ వారు రజనీకాంతరావుగారిమీద ప్రచురించిన విశేష సంచిక 'రజని ' నీ అవిష్కరించే అదృష్టం కూడ కలిగింది.
రారాజచంద్రుడు
సెంబర్ చివరి రోజులంతా ఏదో ఒక పారవశ్యంతో గడుస్తాయి. క్రిస్మస్ నుంచి కొత్త సంవత్సరం వచ్చేదాకా ప్రతిరోజూ వెలుతురు వైపు ప్రయాణంలాగా ఉంటుంది. బైరాగి అన్నట్లుగా- శైశిర ప్రాత:పథాన తుహిన స్నాతావనిపై రవికిరణావలోకనముల
21 వ శతాబ్దానికి అవసరమైన నైపుణ్యాలు
విద్య గురించిన ఆలోచనలు నన్ను గాఢంగా ఉత్తేజితుణ్ణి చేస్తుంటాయి, సాహిత్యంలానే. కానీ, ఒక తేడా ఉంది. సాహిత్యం చదవడం, చదివినపుస్తకాల గురించి మాట్లాడుకోవడం, ఒక కవితనో కథనో రాయడం ఎప్పటికీ ఉత్తేజకారకాలేగాని, విద్య అట్లా కాదు. విద్యామీమాంస నన్ను ఎంత ఉత్తేజితుణ్ణి చేస్తుందో, అంత చింతాక్రాంతుణ్ణి కూడా చేస్తుంది.
