ప్రసిద్ధ చిలీ కవి/వికట కవి నికనర్ పారా మంగళవారం ఈలోకాన్ని భౌతికంగా వీడిపోయాడన్న వార్త నిన్న ఎం.ఎస్.నాయుడు వాల్ మీద చూసాను. పారా ఇంతకాలం బతికున్నాడని ఇప్పుడీ మరణవార్త చూసాకనే తెలియడంలో కూడా ఒక ఐరనీ ఉందనిపించింది.
జోర్జ్ లూయీ బోర్హెస్
జోర్జ్ లూయీ బోర్హెస్ (1899-1986) అర్జెంటీనాకు చెందిన కవి, కథకుడు, ఆలోచనాపరుడు, విమర్శకుడు. మాజికల్ రియలిజంగా ప్రసిద్ధి చెందిన విశిష్ట కథన ప్రక్రియకి ఆద్యుడు. 20 వ శతాబ్ది పూర్వార్థంలో ఇలియట్, జాయిస్, పౌండ్, కాఫ్కా,మార్సెల్ ప్రూ వంటి రచయితలు ప్రపంచసాహిత్యాన్ని గాఢంగా ప్రభావితం చేసారు.
బోర్హెస్ సంభాషణలు
ఒక్క మాటలో చెప్పాలంటే, బోర్హెస్ ఒక మిస్టిక్, కానీ ఆధునిక rational ప్రపంచం మాత్రమే సృష్టించగల మిస్టిక్. ఆ మిస్టికానుభవం ఎలాంటిదో తెలుసుకోడానికి బోర్హెస్ కథలు చదవాలి, పుస్తక సమీక్షలు చదవాలి, ఇదిగో, ఈ సంభాషణలు చదవాలి.
