మనం పొద్దున్నే ఏటిఒడ్డుకో, తోటదాపుకో నడుచుకుంటూ వెళ్ళివచ్చినప్పుడు, ఆ పూలగాలీ, ఆ పచ్చిగాలీ ఇంకా మనల్ని అంటిపెట్టుకుని ఉండగానే, వస్తూ వస్తూ ఊరికినే రాలేక, దారిలో కనబడ్డ నాలుగు పూలు తెంచుకుని మరీ వస్తామే, అలానే ఇందులోంచి రెండు కవితలు తెలుగులోకి తెంపి మీకు అందివ్వకుండా ఎలా ఉండగలను?
కోసక్కులు
ఇన్నాళ్ళకు కోసక్కులు చదివేక నాకు అర్థమయిందేమంటే, తనలోని ఈ విముక్తి అవసరాన్ని ఆయన కాకసస్ లోని తొలిరోజుల్లోనే గుర్తుపట్టాడని. పూర్వరచయితల్లాగా ఆ ప్రకృతిని ఒక సుందరసీమగా మాత్రమే ఆయన చూడలేకపోయాడు. అక్కడ స్వతంత్రంగా జీవించే మనుషులున్నారనీ, నువ్వు నిజంగా ఆ సీమని ప్రేమిస్తే, నువ్వు చెయ్యవలసింది ముందు వాళ్ళల్లో ఒకడివి కావడమేననీ ఆయన గుర్తుపట్టాడు.
దిగులు కలిగినదేలనొ
తోట లోపల వింటి నేనొక మధుర మంజుల మంత్రగానము తీపి తలపులు మదిని నిండగ దిగులు కలిగినదేలనొ
