నగరం ఆసాంతం మేను వాలుస్తున్నది. దీపాలతో ప్రకాశిస్తున్న వీథుల్లో సద్దుమణుగుతున్నది, వెలుగుతున్న దివిటీలతో బండ్లు త్వరితంగా కదిలిపోతున్నవి. గడిచిన రోజంతా కూడగట్టుకున్న సంతోషాలతో. ..
హోల్డర్లిన్ -3
ఆకుపచ్చమీదా, కొండకోనమీదా బొమ్మ గీసినట్టుగా కనిపిస్తున్న అడవి అంచుల్లో నేను నడిచినప్పుడల్లా నా గుండెలో బాధిస్తున్న ప్రతి ముల్లుకీ గొప్ప ప్రశాంతి నన్ననుగ్రహిస్తుంది.
హోల్డర్లిన్-1
ఈ ఉత్తరం రాసినప్పుడు ఆయనకి ఇరవై ఎనిమిదేళ్ళు. కాని అతడికి తెలీదు, భారతీయ భక్తి కవులు దేశభాషల్లో కవిత్వం చెప్తున్నప్పుడు, ఒక కబీరు, ఒక బుల్లేష, ఒక తుకారాం చేసిందిదే అని. తనకి తెలీకుండానే భారతీయ భక్తికవులకి హోల్డర్లిన్ చాలా సన్నిహితంగా రాగలిగేడు.
