ప్రేమపానంతో మత్తెక్కాను

రంజాన్. ప్రార్థనలతో,ఉపవాసాలతో,దానాలతో గడిచిన నెల. మెహిదిపట్నంలో నేను చూస్తున్న ప్రతి రంజాన్ నెలా ఒకప్పుడు నేను శ్రీశైలంలో చూసిన మాఘమాసాన్ని గుర్తుతెస్తూంటుంది. గాల్లో ఒక తేటదనం, శుభ్రత్వం ఆవరించినట్టుంటాయి.

అతిథిగృహం

రూమీ కవితని చూసి నాగేశ్వర్ కె.ఎన్.ఆర్ గారు బరంపురం నుంచి పరవశిస్తూ తనకి ఆ కవిత్వం ఇంకా ఇంకా కావాలనిపిస్తోందన్నారు. పులికొండ సుబ్బాచారిగారు గొప్ప సాహిత్యరసజ్ఞులు 'రూమీ గానం చేసాడని రాసారు, కాని మీ అనువాదం వచనంగానే ఉందికదా' అన్నారు.

పైకి ఇద్దరం, ఆత్మలో ఒక్కరం

'మీరు రూమీ గురించి తన్మయత్వంతో రాస్తున్నారని తెలుస్తోంది గాని,ఆ తన్మయత్వం ఎందుకో తెలియడం లేదు 'అన్నారొక మిత్రురాలు నిన్న నేను రూమీ గురించి రాసింది చదివి. 'రూమి అంటే మాకు తెలిసింది ఆయనొక ప్రేమకవి అని మాత్రమే' అని కూడా అన్నారామె.