బైరాగిని చదవడం మొదలుపెడదాం

బైరాగి శతజయంతి సంవత్సరం సందర్భంగా కవిసంధ్య పత్రిక ఒక ప్రత్యేక సంచిక తీసుకువస్తున్నారనీ, దానికోసం ఒక వ్యాసం రాసిమ్మనీ శిఖామణి అడిగారు. పత్రిక కాబట్టి స్థలనియంత్రణ తప్పనిసరి. కాబట్టి బైరాగి గురించి నాలో సముద్రమంత ఘూర్ణిల్లుతున్న భావోద్వేగాన్ని ఒక వ్యాసం రాయడం నిజంగా పరీక్షనే. ఆ వ్యాసాన్నిక్కడ మీతో పంచుకుంటున్నాను.

మేఘదూతం

నువ్వు తప్ప, కవీ, ఆ లక్ష్మీధామానికి నన్ను మరెవ్వరు తీసుకుపోగలరు? అక్కడ సకలసంపదలమధ్య శోకిస్తున్న ఆ ప్రియసన్నిధికి?