ప్రవాస దుఃఖాన్ని వ్యక్తీకరించడంలో చీనా సాహిత్యంలో అటువంటి కవిత మరొకటి లేదు. అందులో బెంగ, అపరాధ భావం, అవమానం, వినష్టహృదయం మాత్రమే లేవు. నిజానికి అది ఒక ప్రదేశానికి దూరమైన దుఃఖం కాదు. తిరిగి రాని, ఎన్నటికీ తాను తిరిగి చూడలేని ఒక వైభవోజ్జ్వల శకం గురించిన దుఃఖం.
యుగయుగాల చీనా కవిత-20
ప్రాచీన చీనా కవుల్ని మన కవిత్రయంతోనూ, యోంగ్ మింగ్ కవుల్ని ప్రబంధ కవులతోనూ పోల్చి చూసుకుంటే, వారు సాహిత్యంలో పెద్ద పీట వేసిన ఇంద్రియనైశిత్యం గర్హనీయం కాకపోగా, స్వాగతించదగ్గదే అనిపిస్తుంది.
యుగయుగాల చీనా కవిత-19
రొకవైపు తోటి మనుషుల పట్ల తన సాంఘిక బాధ్యతను నెరవేర్చుకోగలననీ అతడు భావించాడు. పరస్పర విరుద్ధాలైన డావోయిస్టు-కన్ ఫ్యూసియన్ జీవితాదర్శాలను ఆ విధంగా సమన్వయం చేసుకోవచ్చునని అతడు నమ్మాడు. కాని ఆ దారి ఏమంత రొమాంటిక్ కాదని కూడా అతడికి తెలుసు. తన పొలాల్లో కలుపు మొక్కలూ, పండ్లతోటల్లో పురుగులూ పొంచి ఉంటాయని మనకన్నా అతడికే ఎక్కువ తెలుసు.
