ఈ ప్రపంచంలో ఇంకా చెప్పుకోదగ్గది ఏది మిగిలిఉందో- ఒక వర్ణచిత్రం, రాతిమీద చెక్కిన పువ్వు, ఒక లలితగీతం, నేలబారు మనుషులు అందుకోలేని గొప్ప భావం- ప్రతి ఒక్కటీ ఒక విలాసం కిందనే లెక్క. విలాసం అత్యున్నతమానవుడి అత్యంత ప్రాథమిక అవసరం.
నిజమైన జీవితాశయం
భారతదేశానికి బుద్ధుడెలాగో, గ్రీసుకి సోక్రటీసెలాగో, చైనాకి కన్ ఫ్యూసియస్ ( క్రీ.పూ. 551-479) అలాగ. గత రెండువేల అయిదువందల చీనా చరిత్రమీదా, సంస్కృతిమీదా ఆయన ముద్ర అపారం.ఇరవయ్యవశతాబ్దిలో ఆయన భావజాలం మీద పెద్ద తిరుగుబాటు చెలరేగింది.
పూలు వికసిస్తున్నాయి, వాడిపోతున్నాయి
ప్రాచీన చీనా కవిత్వంలో అద్భుతమైన కవిత్వం చెప్పిన కవయిత్రులున్నారు. కాని ప్రసిద్ధి చెందిన కవితాసంకలనాల్లో వాళ్ళ కవితలు చేరనందువల్ల బయటి ప్రపంచానికి వాళ్ళ గురించి ఎక్కువ తెలియలేదు. చీనా కవిత్వాన్ని ఇంగ్లీషులోకి అనువాదం చేసిన మొదటితరం అనువాదకులు కూడా ప్రసిద్ధి చెందిన కవులమీదనే ఎక్కువ దృష్టిపెట్టారు.
