యుద్ధకవి

యుద్ధమంటే ఎలా ఉంటుందో చూడని వాడు, యుద్ధం తన జీవితాన్నీ, తన వాళ్ళ జీవితాన్నీ అతలాకుతలం చెయ్యడమెలా ఉంటుందో తెలియనివాడు మాత్రమే తుపాకుల్నీ, బేయొనెట్లనీ, బుల్లెట్లనీ కీర్తిస్తూ కవిత్వం చెప్తాడు. కాని నిజంగా యుద్ధంలో మునిగిపోయినవాడు రాసే కవిత్వమలా ఉండదు. అదెలా ఉంటుందో చూడాలంటే దు-ఫు లాంటివాడి కవిత్వం చదవాలి.

కొత్త యుగం రచయిత్రి-1

ఆమె మామూలు రచయిత్రి కాదనీ, ఆమె ఒక దేశానికీ, ఒక దేశచరిత్రకీ మాత్రమే ప్రతినిధి కాదనీ, ప్రపంచంలో ఏ మూల ఏ పాఠకుడు తన పుస్తకాలు చేతుల్లోకి తీసుకున్నా అతణ్ణి లోపలనుంచీ కుదిపెయ్యగల శక్తి ఏదో ఆమె అనుభవాలకీ, ఆలోచనలకీ, భావనలకీ, పర్యావలోకనానికీ ఉందని అర్థమయింది.