జీవితంలోని క్షణభంగురత్వాన్ని రాలుతున్న పూలు స్ఫురింపచేసినంతగా మరే దృశ్యమూ స్ఫురింపచెయ్యలేదనుకుంటాను. కాని చిత్రమేమింటంటే, ఈ దృశ్యం వైరాగ్యాన్ని మేల్కొల్పదు. అంతకన్నా కూడా జీవితం పట్ల మరింత ఇష్టాన్నే పెంచుతుంది
వసంతకాలపు మెత్తటి లేజాయ
ఆ కవితల ఒక ఇంగ్లీషు అనువాదానికి ముందుమాట రాస్తూ, విక్టర్ ఎచ్ మయర్ అనే ఒక విద్వాంసుడు చింగ్ చావో కవితలు చదవడం ఒక ఆదివారం అపరాహ్ణం ఎమిలీ డికిన్ సన్ ని చదవడం లాగా ఉందని రాసుకున్నాడు
కొకింషు
ఈ కవితల ఇతివృత్తాలు బహువిధాలు. తొలివసంతకాలంలో ఏరుకున్న పూలు, వేసవికాలపు కోకిలపాట, హేమంతకాలపు ఫలసేకరణ, శీతాకాలపు మంచురాలుతుండే దృశ్యం, కొంగలూ, తాబేళ్ళూ, వేసవివనమూలికలమీద వాలే గోరింకలు, ప్రణయసంకేతాలు, యాత్రీకులు ప్రార్థనలు చేసే పర్వతప్రాంత దేవాలయాలు
